ఆంగ్ల భాషకు నేను ఎంత మాత్రం వ్యతిరేకిని కాను. ఆ భాష పైన నాకు చాల గౌరవం ఉంది. కాని ప్రపంచీకరణ వలన చాలా మంది తమ తమ మాతృ భాషలను మరిచి పోవటమే కాకుండా తమ పిల్లలకు కూడా నేర్పించడం లేదు. ఇది ఒక దుష్పరిణామం కాగా అవసరానికి మించి ఆ భాషలోని పదాలు మనం ఎగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచీకరణకు సంసిద్ధులుగా ఉంటూనే ప్రతీ ఒక్కరు తమ మాతృభాషకు తగిన గౌరవం ఇవ్వాలన్నదే నా అభిప్రాయం.